TS News: కాంగ్రెస్‌ నాయకత్వం, పంజాబ్‌ సీఎం కలిసి కుట్ర పన్నారు: మురళీధర్‌రావు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్‌ పర్యటన సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్‌ నాయకత్వం, ఆ రాష్ట్ర సీఎం కలిసి కుట్ర పన్నారని భాజపా జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్‌

Published : 13 Jan 2022 01:25 IST

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్‌ పర్యటన సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్‌ నాయకత్వం, ఆ రాష్ట్ర సీఎం కలిసి కుట్ర పన్నారని భాజపా జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్‌ ఇన్‌ ఛార్జి మురళీధర్‌రావు ఆరోపించారు. ప్రధాని భద్రతకు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్‌ పార్టీ బహిరంగసభ గురించి మాట్లాడుతుందని ఆయన హైదరాబాద్‌లో విమర్శించారు. ప్రధాని భద్రతపై ప్రతిపక్ష పార్టీ నిర్లక్ష్యంగా ఉందని ధ్వజమెత్తారు. ప్రధాన మంత్రి ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆ రాష్ట్ర సీఎం, సీఎస్‌, డీజీపీ వెళ్లి స్వాగతం పలకాల్సి ఉందని గుర్తు చేశారు. కానీ, ప్రధాన మంత్రి వెళితే ఈ ముగ్గురిలో ఒక్కరూ వెళ్లలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. పంజాబ్‌ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందని  స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటకు వచ్చిందని పేర్కొన్నారు. ప్రధాని భద్రత, దేశ సరిహద్దు విషయంలో భాజపా ఎప్పుడూ ఇలా వ్యవహరించలేదన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని