Karnataka: ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.. భాజపాకు 65 సీట్లకు మించవు: డీకేఎస్
కర్ణాటక(Karnataka)లో భాజపా ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. ఈసారి ఆ పార్టీకి 65సీట్లకు మించి రావని కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు.
బెంగళూరు: త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో(Karnataka assembly polls) భాజపా గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని రాష్ట్ర కాంగ్రెస్(congress) చీఫ్ డీకే శివకుమార్(DKS) అన్నారు. మొత్తం 224 సీట్లకు గాను అధికార భాజపాకు 65 సీట్లకు మించి రావని.. సీట్లు 40కి తగ్గినా ఆశ్చర్యంలేదని వ్యాఖ్యానించారు. మే నెలలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 140 సీట్లు సాధిస్తుందంటూ నిన్న కొన్ని సర్వే సంస్థల అంచనాలు వెలువడిన నేపథ్యంలో బుధవారం ఆయన స్పందించారు. బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. తమకు వచ్చే సీట్ల విషయంలో గ్యారెంటీ ఉందన్నారు. అలాగే, భాజపాకు 65కి మించి సీట్లు రావన్న విషయంలోనూ తమకు ఓ అంచనా వచ్చినట్టు తెలిపారు. భాజపా ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో 140 సీట్లకు పైగా గెలుచుకుంటామని యడియూరప్ప ఇటీవల చేసిన వ్యాఖ్యలు వారి అంతర్గతమని.. వారి పార్టీ విషయాల్లో తాను జోక్యం చేసుకోలేనన్నారు. భాజపా నేతలు ఏం చేసినా సరే.. ఆ పార్టీకి 60 నుంచి 65 సీట్లకు మించి రావన్నారు. ఒకవేళ 40 సీట్లకన్నా తక్కువ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు. 2008-13లో భాజపా అధికారంలో ఉన్న తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి 40 సీట్లే వచ్చాయని గుర్తు చేశారు. అలాగే, ‘40శాతం కమీషను’ తీసుకొని పనిచేస్తోన్న భాజపా ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో సీట్లు 40కి పడిపోవడంలే ఆశ్చర్యం ఏముందని తీవ్రంగా విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీని బోగస్ అంటూ సీఎం బొమ్మై చేసిన వ్యాఖ్యల్ని డీకేఎస్ తిప్పికొట్టారు. అబద్ధాలు చెప్పడంలో బొమ్మైకి ఎవరూ సాటిరారని ధ్వజమెత్తారు.
మరోవైపు, ఎన్నికలకు సమయం ఇంకా రెండు నెలల సమయమే మిగిలి ఉన్న నేపథ్యంలో కర్ణాటకలోని రాజకీయ పార్టీలు విజయమే లక్ష్యంగా అస్త్రాలను సిద్ధం చేసుకొంటున్నాయి. ఆయా వర్గాల ప్రజల్ని తమవైపు ఆకర్షించుకొనే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రజాకర్షక పథకాలను ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా అభ్యర్థుల ఎంపికపైనా ప్రధానంగా దృష్టిపెట్టి తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి స్క్రీనింగ్ సమావేశం నిర్వహించింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి 75శాతం ప్రక్రియ పూర్తయిందని.. ఈరోజు మిగతాది పూర్తిచేసి జాబితాను పార్టీ అధిష్ఠానానికి పంపనున్నట్టు డీకేఎస్ తెలిపారు. 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 104 సీట్లు గెలుచుకొని ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. అయితే, కాంగ్రెస్‌కు 80, జేడీఎస్ 37 సీట్లలో గెలుపొందడంతో ఆ రెండు పార్టీలు జట్టుకట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గద్దెనెక్కాయి. ఈ క్రమంలోనే కొందరు జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి భాజపా వైపు వెళ్లడంతో అధికారానికి కావాల్సిన బలం పొందిన భాజపా ఆ తర్వాత అధికార పీఠం దక్కించుకున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాంపోజిట్ తెలుగు కొనసాగింపు
-
ఆ ఇంటికి దీపం ‘స్వర్ణభారత్’.. దత్తత తీసుకున్న అమ్మాయికి వివాహం జరిపించిన మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె
-
Rain Alert: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
-
CM Jagan: కరకట్ట రోడ్డు కనిపిస్తోందా సారూ..!
-
Asian Games: అన్న అక్కడ.. తమ్ముడు ఇక్కడ
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ