Andhra News: రూ.48వేల కోట్ల అవినీతి జరిగిందనడం అర్థంలేని ఆరోపణ: బుగ్గన

ఆంధ్రప్రదేశ్‌లో రూ.48 వేల కోట్ల అవినీతి జరిగిందని తెదేపా నేత యనమల ఆరోపించడం అర్థంలేని ఆరోపణ అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

Published : 28 Mar 2022 01:17 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రూ.48 వేల కోట్ల అవినీతి జరిగిందని తెదేపా నేత యనమల ఆరోపించడం అర్థంలేని ఆరోపణ అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. యనమల సహా తెదేపా నేతలు చేస్తున్న ఆ ఆరోపణలు పూర్తి అవాస్తవాలని పేర్కొన్నారు. సీఎఫ్‌ఎంఎస్‌లో స్పెషల్‌ బిల్లులు అంటూ ఏవీ ఉండవని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎఫ్‌ఎంఎస్‌ స్పెషల్‌ బిల్స్‌ అనేది లేదని ఏజీకి వివరణ ఇచ్చినట్లు చెప్పారు. వేస్‌ అండ్‌ మీన్స్‌ అనేది తాత్కాలిక అప్పు మాత్రమేనని బుగ్గన వివరించారు. తాత్కాలిక అప్పును అదే ఏడాది పూర్తిగా చెల్లిస్తారని పేర్కొన్నారు. 2020-21లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.30 వేల కోట్ల ఆదాయం తగ్గిందని, ఆదాయం బాగా తగ్గినా సంక్షేమ పథకాలు ఏవీ ఆపలేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని