AP CEO: ఏపీలో 46వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలు: సీఈవో

దరఖాస్తు చేసిన వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు అందిస్తామని సీఈవో ముఖేష్ కుమార్‌ మీనా తెలిపారు. 

Published : 16 Mar 2024 17:00 IST

అమరావతి: దరఖాస్తు చేసిన వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు అందిస్తామని సీఈవో ముఖేష్ కుమార్‌ మీనా తెలిపారు. రాష్ట్రంలో 46వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి  చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. ‘‘ప్రతి పోలింగ్‌ కేంద్రంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో 4 లక్షల మంది ఉద్యోగులను వినియోగిస్తున్నాం. ఈసారి ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్‌ వేసేందుకు అవకాశం ఉంది. క్రిమినల్‌ కేసులు ఉన్న అభ్యర్థులు పత్రికలు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలి. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో భద్రత పెంచుతాం. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు ఇప్పటికే పరీక్షించాం. ఇప్పటి వరకు రూ.164 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాం’’ అని సీఈవో వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని