Chandra babu: జగన్‌ ఇచ్చేది గోరంత.. చెప్పేది కొండంత: చంద్రబాబు

ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, కలిసొచ్చే వారితో పనిచేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 

Published : 17 Nov 2022 01:08 IST

పత్తికొండ: ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, కలిసొచ్చే వారితో పనిచేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. తెదేపా హయాంలో 5ఏళ్లలో 6లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు. 

‘‘జగన్‌ వచ్చాక ఒక్క పరిశ్రమ రాలేదు. జాబ్‌ మేళా లేదు.. జాబ్‌ క్యాలెండర్‌ లేదు. తెదేపా అధికారంలో ఉంటే కడపలో స్టీల్‌ ప్లాంట్‌ పెట్టే వాడిని. నా మీటింగ్‌కు వచ్చి డిస్టర్బ్‌ చేస్తారా? పత్తికొండ ఎమ్మెల్యే పేటీఎం బ్యాచ్‌ను పంపించారు. పేటీఎం బ్యాచ్‌కు మేం భయపడం.

జగన్‌.. నేను మీ నాన్నను చూశా. మీ తాతను చూశా. నీకు భయపడతానా? ఈ నరహంతక జగన్‌ని ఇంటికి పంపించాలి. అన్నీ పత్తికొండ ఎమ్మెల్యేకే కావాలి. అరాచక శక్తులను తుదముట్టించాలి. కొంతమంది పోలీసుల వల్ల డిపార్ట్‌మెంట్‌కు చెడ్డపేరు వస్తోంది. మీరు తప్పు చేస్తే సీఎం కాపాడలేరు. జగన్ ఇచ్చేది  గోరంత.. చెప్పేది కొండంత. హైదరాబాద్‌ నగరాన్ని 25 ఏళ్ల క్రితం అభివృద్ధి చేశా. నా ముందు చూపు వల్లే హైదరాబాద్‌లో యువతకు ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఆడపిల్లలే ఐటీలో ఎక్కువ సంపాదిస్తున్నారు. జగన్‌ తాడేపల్లిలో కూర్చొని బటన్‌ నొక్కుతాడు. రాత్రి ఇంటికి లారీల్లో డబ్బులు వస్తాయి. రాత్రంతా లెక్కపెట్టుకుంటాడు. వివేకాహత్య కేసుపై ఆయన కుమార్తె సునీత ఫైట్ చేసి వేరే రాష్ట్రానికి కేసును బదిలీ చేయించారు. ఆమె పోరాటానికి అభినందనలు. పత్తికొండకు రోడ్డు వేయలేని వ్యక్తి రాష్ట్రానికి 3 రాజధానులు కడతారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని