AP news: మహిళలకేదీ భద్రత: చంద్రబాబు

ఏపీలో మహిళలకు రియల్ టైం భద్రత కల్పించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. గత రెండేళ్లలో మహిళలపై దాడులు పెరగటం

Updated : 22 Jun 2021 05:27 IST

అమరావతి: ఏపీలో మహిళలకు రియల్ టైం భద్రత కల్పించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. గత రెండేళ్లలో మహిళలపై దాడులు పెరగటం విచారకరమన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ అధికారిక నివాసానికి సమీపంలో సీతానగరం పుష్కర్‌ ఘాట్ వద్ద యువతిపై అత్యాచార ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. దిశా చట్టం కింద ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదు చేశారు, 24గంటల్లో ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని డీజీపీ గౌతం సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. 

"నేరస్థులపై ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవటం వల్ల సంఘ వ్యతిరేక శక్తులు మహిళలపై మరింతగా దాడులకు తెగబడుతున్నాయి. దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ మొబైల్ వాహనాలు, ప్రత్యేక యాప్ అన్నీ మోసపూరితంగా మారాయి. ఇద్దరు దుండగులు జంటను బ్లేడ్ తో బెదిరించి యువతిపై అత్యాచారం చేసి వారి వద్ద ఉన్న నగదు, ఇతర వస్తువులు దోచుకొని చీకట్లో తప్పించుకున్నారు. మహిళలను రక్షించలేని చట్టాలు, యాప్‌ల వల్ల ఉపయోగమేంటి? అత్యాచార ఘటన జరిగి ఇన్ని గంటలు గడిచినా ఎలాంటి చర్యలు లేవు. సీతానగరం ప్రాంతంలో సమర్థవంతమైన పోలీసింగ్, పెట్రోలింగ్ అవసరం. ఈ ప్రాంతంలో గతంలో ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్టు శిథిలావస్థలో ఉండటం బాధాకరం. డీజీపీ కార్యాలయం, ముఖ్యమంత్రి నివాసాలకు దగ్గర మాదకద్రవ్యాల అమ్మకం, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న ఫిర్యాదులు ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం దురదృష్టకరం. ప్రజల్లో విశ్వాసం పెంచేలా కృష్ణా నది ఒడ్డున పోలీసు గస్తీ పెంచటంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల రక్షణకు చర్యలు చేపట్టాలి. నేరస్థుల్ని త్వరగా పట్టుకోవాలి." అని చంద్రబాబు తన లేఖలో డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు