ప్రభుత్వ నిర్లక్ష్యానికి 33మంది బలైపోయారు: ఈసీకి చంద్రబాబు లేఖ

కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పింఛన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఫిర్యాదు చేశారు.

Published : 05 Apr 2024 21:58 IST

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పింఛన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 33 మంది చనిపోయారని ఈసీకి తెలిపారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న సీఎస్‌ పైనా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పింఛన్ల పంపిణీ అంశంలో తెదేపాపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైకాపాపైనా ఫిర్యాదు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని