Daggubati Purandeswari: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అనుమానాస్పదంగా సీఐడీ తీరు: పురందేశ్వరి
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లలో ఒక్కటైనా అధికారులు సందర్శించారా అని ఆమె ప్రశ్నించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణను, అవసరమైన సౌకర్యాలను స్కిల్ కేంద్రాల్లో కల్పించినట్లు తమ పరిశీలనలో తేలిందని పురందేశ్వరి తెలిపారు.
దిల్లీలో సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు ప్రెస్‌మీట్.. తెలుగు మీడియా వద్దు..
కల్తీ మద్యం.. ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటం
రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తానని ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్ రెడ్డి.. కల్తీ మద్యాన్ని అమ్మి వారి ప్రాణాలు తీస్తున్నారని పురందేశ్వరి విమర్శించారు. మద్యం కంపెనీల నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు ₹వేల కోట్ల డబ్బు అక్రమంగా అందుతుందని దుయ్యబట్టారు.
‘‘మద్యం విషయంలో వైకాపా అవినీతికి పాల్పడుతోంది. ప్రమాదకరమైన రసాయనాలతో మద్యం తయారు చేస్తున్నారు. ₹15కే లీటర్ మద్యం తయారు చేసి వందల రూపాయలకు అమ్ముతున్నారు. ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం ద్వారా ₹15వేల కోట్ల ఆదాయం వస్తే వైకాపా పాలనలో ₹32వేల కోట్ల ఆదాయం వస్తోంది. మద్యం తయారీ, సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోంది. కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో జగన్ ఆడుకుంటున్నారు’’ అని పురందేశ్వరి విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.