CM Kcr: తెలంగాణను చేతగాని దుర్మార్గులకు అప్పగించి నష్టపోదామా?: కేసీఆర్‌

తెలంగాణ రాకముందు చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్నాం.. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత వ్యవసాయం మెరుగుపరిచామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

Published : 23 Aug 2023 20:04 IST

మెదక్‌: తెలంగాణ రాకముందు చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్నాం.. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత వ్యవసాయం మెరుగుపరిచామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. భారాస మెదక్‌ జిల్లా కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయం, సమీకృత కలెక్టరేట్‌ సముదాయం సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రగతి శంఖారావం సభకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు తెచ్చుకున్నాం.. ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకున్నామని తెలిపారు.

‘‘భాజపా.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలంటోంది. నా ప్రాణం పోయినా కరెంట్‌ మీటర్లు పెట్టేదిలేదని తేల్చి చెప్పాం. ఆ భారం సర్కారు భరిస్తుంది. ఒక్క ఛాన్స్‌ అని కాంగ్రెస్‌ అంటోంది. కర్ణాటకలో అలివికాని హామీలు ఇచ్చి 7గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. మీకు ఒక్క ఛాన్స్‌ ఎందుకివ్వాలి? మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేస్తున్నాం. చేతగాని దుర్మార్గులకు అప్పగించి నష్టపోదామా?’’ అని సభలో శ్రేణులను అడిగితే వద్దు వద్దు అంటూ పెద్ద ఎత్తున అరిచారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామంటోందని, ఇప్పుడు ఉన్న ధరణిలో భూమి యాజమాన్య హక్కును సీఎం, సీఎస్‌ కూడా మార్చలేరని స్పష్టం చేశారు. ధరణిని తీసేయాలన్న కాంగ్రెస్‌ పార్టీని బంగాళాఖాతంలో విసిరేయాలని సీఎం పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని