Revanth Reddy: కేసీఆర్‌.. భారాస గురించి ప్రజలు ఆలోచించడం మానేశారు: సీఎం రేవంత్‌ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సిటింగ్‌ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు (TS High Court) చెప్పిందని సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) తెలిపారు.

Published : 08 Feb 2024 16:58 IST

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సిటింగ్‌ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు (TS High Court) చెప్పిందని సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. విశ్రాంత జడ్జితో విచారణ జరిపించుకోవాలని సూచించినట్లు చెప్పారు. ఉన్నత న్యాయస్థానం చెప్పిన అంశంపై మంత్రివర్గంలో లేదా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మిషన్‌ భగీరథపైనా విచారణకు ఆదేశించామని సీఎం వెల్లడించారు. గవర్నర్ తమిళిసై ప్రసంగం పూర్తి అయిన తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

భారాస అధినేత కేసీఆర్‌ శాసనసభకు రావాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. కృష్ణా జలాల విషయంలో ఆయన చిత్తశుద్ధిని ప్రజలు చూశారన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి రాలేదంటేనే ఆయన ఎంత బాధ్యతగా ఉన్నారో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌, భారాస గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని ఎద్దేవా చేశారు. ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టతతో ఉన్నామన్నారు. విధానపరమైన లోపాలు లేకుండా పాలన సాగిస్తున్నామని సీఎం తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేసేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని