
TS News: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త వివాదం.. సోనియాగాంధీకి ఎం.ఎ ఖాన్ లేఖ
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. పీసీసీ క్రమ శిక్షణ కమిటీ ఏర్పాటు విషయంలో రగడ మొదలైంది. క్రమశిక్షణ కమిటీ వైస్ ఛైర్మన్‌గా నియమితులైన ఎం.ఎ ఖాన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. క్రమశిక్షణ కమిటీ వైస్ ఛైర్మన్ పదవిని తీసుకునేందుకు సిద్ధంగా లేనని లేఖలో స్పష్టం చేశారు. తనకు మాట మాత్రం చెప్పకుండా వైస్ ఛైర్మన్‌గా నియమించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పీసీసీ తనను సిఫారసు చేసే ముందు తెలియజేయలేదని నిరసన వ్యక్తం చేశారు. రాజ్యసభలో పార్టీ విప్‌గా పనిచేసి .. ఈ పదవి తీసుకోలేనని ఎం.ఎ ఖాన్ తెలిపారు.
తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీని కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల ప్రకటించింది. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా చిన్నారెడ్డి, వైస్ ఛైర్మన్‌గా ఎం.ఎ.ఖాన్, సభ్యులుగా ఎ.శ్యామ్ మోహన్, గడ్డం వినోద్, సౌదాగర్, గంగారాం, కమలాకర్‌రావు, సీజే శ్రీనివాసరావులను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.