ఆ బిల్లులతో రైతులకు నష్టం: రాహుల్‌

కేంద్రం రైతులకు సంబంధించి సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆ మూడు బిల్లులను ఉద్దేశిస్తూ ప్రభుత్వం రైతులపై కోలుకోలేని దెబ్బ వేసిందని ఆరోపించారు.

Published : 15 Sep 2020 01:24 IST

దిల్లీ: కేంద్రం రైతులకు సంబంధించి సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆ మూడు బిల్లులను ఉద్దేశిస్తూ ప్రభుత్వం రైతులపై కోలుకోలేని దెబ్బ వేసిందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా కేంద్రంపై మండిపడ్డారు.

‘ఈ రోజు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లులు రైతులపై కోలుకోలేని దెబ్బ వేశాయి. వాటి ద్వారా రైతులు కనీస మద్దతు ధర పొందలేరు. అంతేకాకుండా రైతులు తమ భూముల్ని బలవంతంగా పెట్టుబడిదారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. మోదీజీ రైతులపై చేస్తున్న మరో కుట్ర ఇది’ అని ఆరోపించారు. రైతులు పంట పెట్టుబడికి కావల్సిన వస్తువులను రిటైల్‌ ధరలకు కొనుక్కుని.. తాము పండించిన పంటను మాత్రం హోల్‌సేల్‌ ధరకు అమ్ముకుంటున్నారన్నారు. అదేవిధంగా లోక్‌సభలో కాంగ్రెస్‌ నాయకుడు గౌరవ్‌ గొగొయి మాట్లాడుతూ ‘ఈ బిల్లులు రైతుల్ని, వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి’అని ఆరోపించారు. 

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో రైతులకు సంబంధించి మూడు బిల్లులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పంటల ఉత్పత్తి మరియు వాణిజ్యం, ధర, వ్యవసాయ సేవలకు సంబంధించిన బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ మూడు బిల్లులు వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఉన్న అవరోధాల్ని తొలగిస్తాయని కేంద్ర మంత్రి తోమర్‌ తెలిపారు. అంతేకాకుండా రైతులు తమకు నచ్చిన పెట్టుబడిదారులతో చర్చించుకునేవిధంగా చేస్తాయని అన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని