Bypolls: కొనసాగుతున్న 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలు, దిల్లీలో విస్తరించి ఉన్న మూడు లోక్‌సభ స్థానాలు ఏడు శాసనసభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది....

Published : 26 Jun 2022 10:53 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలు, దిల్లీలో విస్తరించి ఉన్న మూడు లోక్‌సభ స్థానాలు, ఏడు శాసనసభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమైంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంలను తెరిచారు.

తాజా లెక్కింపులో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా భవితవ్యం తేలనుంది. ఆ రాష్ట్రంలో మొత్తం నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. టౌన్‌ బార్డోవాలీ స్థానం నుంచి సాహా పోటీ చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన బిప్లబ్‌ దేబ్‌ రాజీనామాతో సీఎంగా పగ్గాలు చేపట్టారు. త్రిపురలో గురువారం ఎన్నికలు జరగ్గా 76.62 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆజంగఢ్‌, రామ్‌పూర్‌, పంజాబ్‌లోని సంగ్రూర్‌ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దిల్లీలోని రాజేంద్ర నగర్‌, ఝార్ఖండ్‌లోని మందర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఫలితాలు కూడా ఈరోజే వెలువడనున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎప్పీకి చెందిన అఖిలేశ్‌ యాదవ్‌, ఆజం ఖాన్‌ అసెంబ్లీ ఎన్నిక కావడంతో వారు తమ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆజంగఢ్‌, రామ్‌పూర్‌ స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని