Harbhajan Singh: సిద్ధూతో హర్భజన్‌ సింగ్‌.. కాంగ్రెస్‌లో చేరేందుకేనా?

ప్రముఖ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? తాజాగా కనబడుతున్న పరిణామాలు అవుననే సమాధానామే చెబుతున్నాయి. హర్భజన్‌ నేడు.........

Published : 16 Dec 2021 01:06 IST

చండీగఢ్‌: ప్రముఖ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? తాజాగా కనబడుతున్న పరిణామాలు అవుననే సమాధానామే చెబుతున్నాయి. హర్భజన్‌ నేడు పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సిద్ధూ ట్విటర్‌ వేదికగా పంచుకుంటూ.. ‘సాధ్యమయ్యే పరిస్థితులు కన్పిస్తున్న ఫొటో’ అని రాసుకొచ్చారు. దీంతో కాంగ్రెస్‌లోకి భజ్జీ చేరిక ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం పంజాబ్‌ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ నేడు సమావేశం కానుంది. దీనికి కొద్ది గంటల ముందు సిద్ధూ - భజ్జీ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరికొన్ని నెలల్లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ క్రికెటర్లు హర్భజన్‌ సింగ్‌, యువరాజ్‌ సింగ్‌లపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టినట్లు గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ త్వరలోనే భాజపాలో చేరుతారంటూ ఇటీవల ఓ వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టింది. అయితే ఈ వార్తను భజ్జీ ఖండించారు. అది ఫేక్‌ న్యూస్‌ అని కొట్టిపారేశారు. తాజాగా సిద్ధూను కలవడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం మొదలైంది. మరి దీనిపై భజ్జీ ఎలా స్పందిస్తారో చూడాలి..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని