అధికారంలోకొస్తే విద్యా రుణాలు రద్దు: స్టాలిన్‌

తమిళనాడులో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. అప్పుడే హామీల వర్షం కురిపించడం మొదలు పెట్టాయి. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్‌ కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే.....

Published : 03 Jan 2021 19:25 IST

ఈరోడ్‌: తమిళనాడులో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. అప్పుడే హామీల వర్షం కురిపించడం మొదలు పెట్టాయి. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్‌ కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే ఉన్నత విద్యాభ్యాసం కోసం తీసుకున్న విద్యా రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోడ్‌ పశ్చిమ నియోజకవర్గంలోని ఓ గ్రామసభలో పాల్గొన్న సందర్భంగా ఆయన ప్రకటన చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, విద్యా ప్రమాణాలు పడిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు.

అధికార అన్నాడీఎంకే పార్టీపైనా స్టాలిన్‌ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నూరు రోజుల పనిదినాలు కల్పించడంలోనూ దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. డీఎంకే అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో పనిదినాల కల్పనకు కృషి చేస్తామని ప్రకటించారు. అలాగే ఉపాధి హామీ పనిదినాలను 150కి పెంచాలని కేంద్రాన్ని కోరతానని స్టాలిన్‌ చెప్పారు. 

ఇవీ చదవండి..
వ్యాక్సిన్లకు అనుమతిపై కాంగ్రెస్‌ భిన్న వాదనలు
రామతీర్థం ఘటనలో 12 మంది అరెస్ట్‌: ఎస్పీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని