Fuel Prices: ప్రతి నెలా ఎన్నికలు జరగాలేమో.. ఇంధన ధరల పెంపుపై ఎంపీ వ్యంగ్యాస్త్రాలు

పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరల పెంపుపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తాజాగా నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ సుప్రియా సూలే కూడా దీనిపై స్పందిస్తూ.. కేంద్రంలోని

Updated : 24 Mar 2022 04:32 IST

దిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరల పెంపుపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తాజాగా నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ సుప్రియా సూలే కూడా దీనిపై స్పందిస్తూ.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. కేవలం ఎన్నికలే వీటి ధరలను కంట్రోల్‌ చేయగలవంటూ ఎద్దేవా చేశారు. ‘‘ఇంధన ధరల పెంపును ఎన్నికలే ఆపగలవు. ప్రతి నెలా ఎన్నికలు జరగాలి. అప్పుడైనా పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు పెరగకుండా ఉంటాయి’’ అని సుప్రియ లోక్‌సభలో అన్నారు. 

ఇదిలా ఉండగా.. చమురు ధరల పెంపుపై విపక్షాల నిరసనలతో పార్లమెంట్‌ ఉభయసభలు వాయిదా పడ్డాయి. ధరల పెంపును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. రాజ్యసభలో విపక్షాలు వరుసగా నినాదాలు చేస్తుండటంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అటు లోక్‌సభలోనూ ఇదే గందరగోళం నెలకొంది. 

దాదాపు నాలుగు నెలల తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ చమురు సంస్థలు మంగళవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బుధవారం కూడా ఈ ధరల పెంపు కొనసాగింది. రెండు రోజుల్లోనే లీటర్‌ పెట్రోల్ ధర రూ.1.60 పెరగడం గమనార్హం. అటు వంట గ్యాస్‌ సిలిండర్‌పైనా రూ.50 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని