‘తెలంగాణకు కేసీఆర్‌ తీరని ద్రోహం చేస్తున్నారు’

నదుల అనుసంధానం పేరుతో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు కొట్టేసేందుకు తెలంగాణకు సీఎం కేసీఆర్‌ తీరని ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌ భేటీలో చర్చకు వచ్చిన అంశాల విషయంలో...

Updated : 15 Jan 2020 17:48 IST

హైదరాబాద్‌: నదుల అనుసంధానం పేరుతో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు కొట్టేసేందుకు తెలంగాణకు సీఎం కేసీఆర్‌ తీరని ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌ భేటీలో చర్చకు వచ్చిన అంశాల విషయంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం అధికంగా ఉన్న తెలంగాణకు తక్కువ నీటి కేటాయింపులు ఏమిటని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాగం మాట్లాడారు.

ఇచ్చిపుచ్చుకోవడానికి అది ఏమైనా వాళ్ల ఇంటి వ్యవహారమా? అని నిలదీశారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు కాల్వల వెడల్పునకు రూ.23వేల కోట్లు కేటాయించిందని.. అదే జరిగితే తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారిపోతుందని నాగం ఆందోళన వ్యక్తం చేశారు. నీటిపంపకాలపై కేసీఆర్‌కు కనీస అవగాహన లేదని.. తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో కేసీఆర్‌ చర్యలను అడ్డుకుని మహబూబ్‌నగర్‌ జిల్లా రైతాంగ ప్రయోజనాలను కాపాడుకుంటామని నాగం స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని