రైతులకు మద్దతుగా లాంగ్‌ మార్చ్‌: పవన్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, రాష్ట్ర భాజపా నేతలు గురువారం ఉదయం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. భాజపా అధ్యక్షుడిగా  బాధ్యతలు చేపట్టిన నడ్డాకు ఈ సందర్భంగా వపన్‌ శుభాకాంక్షలు

Updated : 23 Jan 2020 11:06 IST

దిల్లీ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, రాష్ట్ర భాజపా నేతలు గురువారం ఉదయం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఈ సందర్భంగా పవన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఇరుపార్టీల కార్యాచరణపై పవన్‌ ..నడ్డాకు వివరించారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్‌, భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

సమావేశం ముగిసిన తర్వాత పవన్‌ మీడియాతో మాట్లాడుతూ... మూడు రాజధానుల అంశాన్ని ప్రధాని, హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లామని వైకాపా నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. వైకాపా నేతలు ఎప్పుడూ రాజధాని అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లలేదని జేపీ నడ్డా కూడా స్పష్టం చేసినట్లు పవన్‌ తెలిపారు. ‘‘రాజధాని మార్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని, హోం మంత్రి అంగీకారం లేదు. వైకాపా నేతలు వారి భూ దందాల కోసమే రాజధానిని మార్చాలని చూస్తున్నారు. వారి స్వార్థం కోసమే ఇదంతా చేస్తున్నారు. ఫిబ్రవరి 2న భాజపా, జనసేన సంయుక్తంగా రాజధాని  రైతులకు మద్దతుగా , ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ కోసం లాంగ్‌ మార్చ్‌ నిర్వహించబోతున్నాం’’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని