కేంద్రమంత్రికి ఎన్నికల సంఘం నోటీసులు

కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌కు ఎన్నికల సంఘం(ఈసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు శాంతి సమస్యతకు..........

Published : 29 Jan 2020 10:18 IST

దిల్లీ: కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌కు ఎన్నికల సంఘం(ఈసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు శాంతిసామరస్యతకు భంగం కలిగేలా ఉన్నట్లు ప్రాథమికంగా తేలిందని ఈసీ అభిప్రాయపడింది. జనవరి 30 మధ్యాహ్నం 12 గంటల కల్లా నోటీసులపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేనిపక్షంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది హెచ్చరించింది.

మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలపై దిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి ఇప్పటికే నివేదిక సమర్పించారని ఈసీ తెలిపింది. నివేదిక ప్రకారం ఇటీవల దిల్లీ రితాలా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఓ సభలో ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించే క్రమంలో ‘దేశద్రోహులు’ అనే నినాదాన్ని పలుసార్లు వాడినట్లు తెలిసిందన్నారు. అలాగే ‘వారిపై తూటాలు పేల్చండి’ అనే వ్యాఖ్యల్ని కూడా నినదించినట్లు నివేదికలో పేర్కొన్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని