‘ఆ తర్వాత ఏ క్షణమైనా విశాఖ నుంచే పాలన’

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బడ్జె్ట్‌ సమావేశాల తర్వాత ఏ క్షణమైనా పాలన విశాఖ నుంచి ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం ద్వారా...

Published : 13 Feb 2020 01:02 IST

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అమరావతి: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బడ్జె్ట్‌ సమావేశాల తర్వాత ఏ క్షణమైనా పాలన విశాఖ నుంచి ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకూ సీఎం జగన్‌ న్యాయం చేస్తున్నారని చెప్పారు. సచివాలయంలో పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పరిపాలన వికేంద్రీకరణకు ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డంకులు కల్పిస్తున్నారని ఆరోపించారు. సీఎంకు ఎక్కడి నుంచైనా పాలన కొనసాగించే అవకాశముంటుందన్నారు. స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే చట్టసవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. స్థానికులే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేలా మార్పులు చేశామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో తీసుకొచ్చిన మార్పులు సత్ఫలితాలిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని