సీఏఏతో మైనారిటీలకు ఏమీ కాదు: పళనిస్వామి

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో డీఎంకే పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అన్నారు. 2020-21 బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆ రాష్ట్ర శాసనసభలో సీఏఏపై వాడీవేడీ చర్చ జరిగింది.

Published : 19 Feb 2020 00:43 IST

చెన్నై: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో డీఎంకే పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అన్నారు. 2020-21 బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆ రాష్ట్ర శాసనసభలో సీఏఏపై వాడీవేడీ చర్చ జరిగింది. డీఎంకేకు చెందిన ఎమ్మెల్యే టి మనో తంగరాజ్‌ మాట్లాడుతూ.. సీఏఏకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఇంతలో ముఖ్యమంత్రి పళనిస్వామి జోక్యం చేసుకుని... సీఏఏ వల్ల భారత్‌లోని మైనారిటీలపై ఉండే ప్రభావం ఏమిటో వివరించాలని డీఎంకే నాయకులను ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఎప్పటికీ మైనారిటీలకు నష్టం కలిగించే చట్టాల్ని అనుమతించదని చెప్పారు. ‘సీఏఏ కారణంగా తమిళనాడులో ఏ మైనారిటీ వర్గంపై ప్రభావం పడుతుందో చెప్పాలని ప్రశ్నిస్తూ.. మేము మీ లాగా ప్రజల్ని తప్పుదోవ పట్టించం’ అని విమర్శించారు. ఈ క్రమంలో తంగరాజ్‌ మళ్లీ స్పందిస్తూ.. సీఏఏకు వ్యతిరేకంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో తీర్మానం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దానికి సీఎం స్పందిస్తూ.. ‘పౌరసత్వ సవరణ చట్టం కేంద్రం పరిధిలో ఉంటుంది.. దానితో రాష్ట్రాలకు సంబంధం ఉండదు’ అంటూ బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని