ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: సంజయ్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించేందుకు ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని భాజపా స్వాగతిస్తోందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి

Updated : 12 May 2020 23:10 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించేందుకు ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని భాజపా స్వాగతిస్తోందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్ పథకం కింద ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ దేశ జీడీపీలో 10 శాతం ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు. దేశం స్వావలంబన దిశగా  ముందుకు వెళ్లేందుకు దేశ ప్రజలకు ప్రధాని మోదీ స్పష్టమైన మార్గాన్ని సూచించారన్నారు. యావత్‌ ప్రపంచం తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో దేశానికి ప్రధాని మోదీ ఓ నిర్ణయాత్మకమైన నాయకత్వాన్ని వహించడం అభినందనీయమన్నారు.

సంజయ్‌పై కేసు నమోదు

తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ రంగనాథ్‌ వెల్లడించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు, భౌతికదూరం పాటించలేదన్న కారణంతో సెక్షన్‌ 188 ప్రకారం పెద్దవూర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బత్తాయి తోట పరిశీలించేందుకు పెద్ద సంఖ్యలో గుమిగూడారని, అందుకే కేసు నమోదు చేశామని ఎస్పీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని