‘పది’ పరీక్షల రద్దుపై పవన్‌ హర్షం

ఏపీలో కరోనా విజృంభిస్తున్న వేళ పదోతరగతి పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనసేన అధినేత పవన్‌.....

Published : 20 Jun 2020 21:16 IST

అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల పక్షాన తమ పార్టీ చేసిన విజ్ఞప్తిని గౌరవించి పరీక్షలు రద్దు చేసినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకున్నారని పవన్‌ పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలతో పాటు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌, సప్లిమెంటరీ పరీక్షలను సైతం రద్దు చేయడం సరైన నిర్ణయమన్నారు పవన్‌. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ దేశంలో అనేక మంది కరోనా బారిన పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని