‘తెలంగాణ ప్రతిష్ఠ ఇనుమడించేలా సచివాలయం’

తెలంగాణ ప్రతిష్ఠ ఇనుమడించేలా నూతన సచివాలయ నిర్మాణం ఉంటుందని మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి అన్నారు.

Published : 08 Jul 2020 00:39 IST

మీడియాతో మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ప్రతిష్ఠ ఇనుమడించేలా నూతన సచివాలయ నిర్మాణం ఉంటుందని మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి అన్నారు. నూతన సచివాలయంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రగతిభవన్‌లో ఆయన స్పందించారు. ‘‘సీఎం కేసీఆర్‌ పాలనపై ప్రజలకు విశ్వాసం ఉంది. నూతన సచివాలయం, ప్రగతిభవన్‌పై ప్రతిపక్షనేతలు అనవసరంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు ఇప్పటికే తిప్పికొట్టారు. ఏ పథకమైనా వద్దనడమే ప్రతిపక్షాలకు అలవాటుగా మారింది. 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామంటే వద్దని ధర్నాలు చేశారు. అన్నీ వద్దంటున్నందునే ప్రజలు మిమ్మల్ని వద్దని చెబుతున్నారు’’అని జగదీశ్వర్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని