Andhra News: ‘పిన్నెల్లికి మంత్రిపదవి ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామాలు’

ఏపీ కేబినెట్‌ కసరత్తు దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో పలుచోట్ల ఆశావహుల అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తుండగా..

Updated : 10 Apr 2022 15:16 IST

మాచర్ల: ఏపీ కేబినెట్‌ కసరత్తు దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో పలుచోట్ల ఆశావహుల అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. మరికొన్ని చోట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే, వైకాపా సీనియర్‌ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈసారి మంత్రిపదవి ఇవ్వకపోతే తామంతా రాజీనామాకు సిద్ధమని అక్కడి మున్సిపల్‌ కౌన్సిలర్లు తేల్చిచెప్పారు. మాచర్లలోని మున్సిపల్‌ కార్యాలయంలో వారంతా సమావేశమై ఈ మేరకు తీర్మానించారు. అక్కడి ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులు కూడా సమావేశయ్యారు. పిన్నెల్లికి ఈసారి కేబినెట్‌లో అవకాశం ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు.

మరోవైపు నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. కాకాణికి మంత్రివర్గంలో చోటు ఖాయమనే ప్రచారం నేపథ్యంలో అభిమానులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. పలువురు నేతలు, కార్యకర్తలు కాకాణికి ముందస్తుగా అభినందనలు తెలుపుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని