Andhra News: ప్రభుత్వ ఉద్యోగివా.. వైకాపా కార్యకర్తవా?
‘నువ్వు ప్రభుత్వ ఉద్యోగివా.. వైకాపా కార్యకర్తవా’ అంటూ మందస మండల అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజరు (ఏపీఎం) జి.ప్రసాదరావును గ్రామస్థులు, డ్వాక్రా మహిళలు నిలదీశారు.
మందస, న్యూస్‌టుడే: ‘నువ్వు ప్రభుత్వ ఉద్యోగివా.. వైకాపా కార్యకర్తవా’ అంటూ మందస మండల అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజరు (ఏపీఎం) జి.ప్రసాదరావును గ్రామస్థులు, డ్వాక్రా మహిళలు నిలదీశారు. జిల్లుండ పంచాయతీ గ్రామాల్లో వచ్చే నెల 2న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం జరగనుంది. ఇందుకు సన్నద్ధం కావాలంటూ డిమిరియా గ్రామంలో శనివారం డ్వాక్రా మహిళలతో ఏపీఎం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అనుసరించాల్సిన విధానాన్ని వివరిస్తూ.. ‘జై జగన్.. జై అప్పలరాజు’ అని నినాదాలు చేశారు. దీంతో కొందరు డ్వాక్రా మహిళలతోపాటు గ్రామస్థులు నిలదీశారు. తప్పయిపోయిందంటూ ప్రసాదరావు అక్కడి నుంచి జారుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Injury: గాయం ‘స్మార్ట్’గా మానిపోతుంది
-
Politics News
Upendar Reddy: కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయ్ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి
-
World News
Joe Biden: ‘చైనాను అభినందిస్తున్నా.. ’: బైడెన్ వీడియో వైరల్
-
India News
Hand Writing: పెన్ను పెడితే.. పేపర్‌పై ముత్యాలే
-
Crime News
Hyderabad: కుమారుల అనారోగ్యంపై మనస్తాపం.. పిల్లలకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య
-
India News
పెళ్లి కోసం 4 గంటల పెరోల్.. వివాహం చేసుకుని మళ్లీ జైలుకెళ్లిన వరుడు