ఎవరైనా బాధపడి ఉంటే వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటా:అచ్చెన్నాయుడు

‘కుప్పంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో పోలీసులున్నా పట్టించుకోలేదు. కొందరి ప్రవర్తన అలా ఉందనే నేను మాట్లాడానుతప్ప వ్యక్తిగతంగా ఎవరినీ కించపరచలేదు.

Updated : 29 Jan 2023 05:19 IST

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: ‘కుప్పంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో పోలీసులున్నా పట్టించుకోలేదు. కొందరి ప్రవర్తన అలా ఉందనే నేను మాట్లాడానుతప్ప వ్యక్తిగతంగా ఎవరినీ కించపరచలేదు. ఒకవేళ ఎవరైనా బాధపడి ఉంటే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రథసప్తమి సందర్భంగా శనివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణస్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. లోకేశ్‌ పాదయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలని స్వామిని కోరుకున్నానని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని