YSRCP: వచ్చే ఎన్నికల్లో పోటీచేయను: వైకాపా ఎమ్మెల్యే సుధాకర్
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ చెప్పారు. ఈ మాటలు విన్న కార్యకర్తలు ఆశ్చర్యపోయారు.
ప్రశ్నించిన నాయకుడికి ఎమ్మెల్యే జవాబు
కర్నూలు గ్రామీణ, న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ చెప్పారు. ఈ మాటలు విన్న కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. కర్నూలు గ్రామీణ మండలం ఉల్చాలలో శనివారం ‘గడపగడపకు’ కార్యక్రమంలో భాగంగా పర్యటించగా వైకాపా మాజీ మండల అధ్యక్షుడు బుర్ర పెద్ద వెంకటేశ్‌నాయుడు ఆయన్ను తీవ్ర పదజాలంతో ప్రశ్నించారు. ‘మీరో నమ్మకద్రోహి. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వాళ్లను పక్కనపెట్టారు. మీకు టిక్కెట్ రావడానికి కష్టపడిన వారిని మరిచిపోయారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన రౌడీమూకలను అందలం ఎక్కించారు. ఇంతటి నమ్మక ద్రోహం చూడలేదు. తగిన మూల్యం చెల్లించుకోక తప్పద’ని ఎమ్మెల్యే సమక్షంలోనే హెచ్చరించారు. దీనికి సుధాకర్ స్పందిస్తూ రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. గ్రామస్థుడు బోయ శివ మాట్లాడుతూ ‘గ్రామంలో కక్షపూరిత రాజకీయాలు పెరిగాయి. తెదేపా శ్రేణులపై దాడులు చేస్తున్నారు. వీటిపై ఫిర్యాదు చేసినా చర్యల్లేవు. మీ ఆదేశాలతో చేస్తున్న బెదిరింపులకు మేం భయపడం’ అని స్పష్టంచేశారు. ఈ సమయంలో వీడియో తీస్తున్న వ్యక్తుల సెల్‌ఫోన్లను పోలీసులు లాక్కొని, వాటిలోని ఫొటోలు, వీడియోలు తొలగించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Vande Bharat Express: సికింద్రాబాద్ - తిరుపతి ‘వందేభారత్’.. ప్రారంభోత్సవం రోజున ఆగే స్టేషన్లు ఇవే!
-
Movies News
Guna Sekhar: అప్పుడు మోహన్‌బాబు నా ఆఫర్ రిజెక్ట్ చేశారు: గుణశేఖర్
-
Politics News
KVP: జగన్‌కు ఎందుకు దూరమయ్యానో త్వరలోనే చెప్తాను : కేవీపీ
-
India News
IndiGo: గగనతలంలో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన.. ఇండిగో విమానంలో ఘటన
-
Sports News
PBKS vs KKR: పంజాబ్ X కోల్‌కతా.. కొత్త సారథుల మధ్య తొలి పోరు
-
Movies News
Rolex: ఒకే స్టేజ్‌పై విక్రమ్ - రోలెక్స్.. సినిమా ఫిక్స్ చేసిన లోకేశ్