ఎస్పీ, కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలి

రామగోపాల్‌రెడ్డికి డిక్లరేషన్‌ ఇవ్వడంలో జాప్యం ప్రజాస్వామ్య విరుద్ధమని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు విమర్శించారు.

Published : 20 Mar 2023 04:35 IST

ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, బీటీ నాయుడు

ఈనాడు, అమరావతి: రామగోపాల్‌రెడ్డికి డిక్లరేషన్‌ ఇవ్వడంలో జాప్యం ప్రజాస్వామ్య విరుద్ధమని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు విమర్శించారు. ఆయన్ని పోలీసులు అర్ధరాత్రి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని.. ఎస్పీ ఫక్కీరప్పను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌పైనా ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం ఒత్తిడి వల్లే డిక్లరేషన్‌ ఇవ్వడంలో అధికారులు జాప్యం చేశారని మరో సభ్యుడు బీటీ నాయుడు ఆరోపించారు.

రెండు బిలఊ్లులకు ఆమోదం

* ఆంధ్రప్రదేశ్‌ వ్యాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ (సవరణ) బిల్లును సవరించడానికి వీలుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ప్రవేశపెట్టిన బిల్లును మండలి ఆమోదించింది.

* ఆంధ్రప్రదేశ్‌ పారావెటర్నరీ అండ్‌ అలైడ్‌ కౌన్సిల్‌ బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తూ మంత్రి అప్పలరాజు ప్రవేశపెట్టిన బిల్లును మండలి ఆమోదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని