నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్‌

గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేశారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆరోపించారు.

Updated : 27 Mar 2023 04:07 IST

ఖమ్మం బుర్హాన్‌పురం, న్యూస్‌టుడే: గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేశారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆరోపించారు. కానీ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్లను నమ్మలేదని, అందువల్లే తాను గెలిచానని చెప్పారు. కార్యకర్తలే పార్టీ, నేతల గెలుపునకు కారణమని, వారిని ఆదుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘‘ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో కొంతమంది పగటి వేషగాళ్లు ప్రజల్ని మోసం చేసేందుకు బయలుదేరారు. వారికి గుణపాఠం చెప్పేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలి. కార్యకర్తలకు మరింత దగ్గరయ్యేందుకు ఈ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నా’’ అని అజయ్‌ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని