రైతుల దీక్ష భగ్నంతో ఉద్రిక్తత

ఆదిలాబాద్‌ జిల్లా రామాయి-రాంపూర్‌ వద్ద రేణుక సిమెంటు పరిశ్రమ ఏర్పాటు కోసం సేకరించిన భూములను రైతులకు తిరిగివ్వాలని డిమాండ్‌ చేస్తూ శనివారం భాజపా నేత సుహాసినిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.

Published : 28 May 2023 06:35 IST

భాజపా నేతల అరెస్టు.. తోపులాట

ఆదిలాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ జిల్లా రామాయి-రాంపూర్‌ వద్ద రేణుక సిమెంటు పరిశ్రమ ఏర్పాటు కోసం సేకరించిన భూములను రైతులకు తిరిగివ్వాలని డిమాండ్‌ చేస్తూ శనివారం భాజపా నేత సుహాసినిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. న్యూరాంపూర్‌ నుంచి రైతులతో కలిసి సుహాసినిరెడ్డి ఎడ్లబండిపై రేణుక సిమెంటు పరిశ్రమ భూముల వద్దకు బయలుదేరారు. మార్గంమధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. తమ దీక్షను అడ్డుకోవద్దంటూ రైతులు సీఐ కాళ్లు మొక్కారు. సుహాసినిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి వాహనంలోకి ఎక్కిస్తుండగా.. కొందరు ఆదివాసీ రైతులు పురుగుమందు డబ్బాలతో పోలీసుల ముందుకొచ్చారు. భాజపా నేతలను తరలిస్తున్న వాహనాలపైకి ఎక్కి అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులకు.. రైతులు, భాజపా నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. చివరికి సుహాసినిరెడ్డిని పోలీసులు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్‌కు పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని