యువతరమా ఆలోచించండి

యువతరమా! ఆలోచించుకోండి అంటూ తెలుగు ప్రొఫెషనల్స్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తేజశ్విని పొడపాటి మహానాడు వేదికగా ప్రశ్నలు సంధించారు.

Updated : 28 May 2023 06:36 IST

తెలుగు ప్రొఫెషనల్స్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తేజశ్విని

* నీచదువు నా బాధ్యత అనే నాయకుడు కావాలా? నీ భవిష్యత్తుతో వ్యాపారం చేస్తాననే నాయకుడు కావాలా?

* రాష్ట్రం కోసం తిండితిప్పలు మానేసే నాయకుడు కావాలా? రాష్ట్రాన్ని దోచుకుతినే నాయకుడు కావాలా? రాష్ట్రంలో యువతను లీడర్లుగా తీర్చిదిద్దే నాయకుడు కావాలా? వారిని ఓట్లు వేసే యంత్రాలుగా చూసే నాయకుడు కావాలా?

* ఆరంకెల జీతంతో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న యువతను సైతం సీఈవోలుగా చేయాలని తపన పడుతున్న చంద్రబాబు కావాలా? అదే యువతను రూ.5వేల జీతానికి వాలంటీర్లుగా మార్చేసే జగన్‌ కావాలా?

* యువతరమా! ఆలోచించుకోండి అంటూ తెలుగు ప్రొఫెషనల్స్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తేజశ్విని పొడపాటి మహానాడు వేదికగా ప్రశ్నలు సంధించారు. ‘‘జాబ్‌ క్యాలెండర్‌పై మాటతప్పి మడమ తిప్పారు, పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు- ఏపీలో అడుగంటిన పారిశ్రామిక ప్రగతి’’ అనే తీర్మానాలపై చర్చ సందర్భంగా ఆమె ప్రసంగించారు. అన్నీ ఇచ్చిన చంద్రబాబును వదిలేసి.. ఏమీ చేయని జగన్‌కు ఓట్లేసిన ఫలితమే రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ‘‘రాష్ట్ర భవిష్యత్తును కాపాడే బాధ్యత యువతరంగా మేము తీసుకుంటాం. మమ్మల్ని పురోగతి వైపు నడిపించి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మీరు తీసుకోండి చంద్రబాబు గారూ! మీ నోటి నుంచి నారా చంద్రబాబునాయుడు అనే నేను... అన్న మాట కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. రాబోయే మహానాడు.. కేవలం చంద్రబాబుగా కాదు.. ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు అనే హోదాలో నిర్వహించుకుందాం’’ అని తేజశ్విని అన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు