వేదపండితులతోనే పార్లమెంట్‌లోకి ప్రవేశం

పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం సమయంలో వేదపండితులతో మాత్రమే ప్రవేశం చేశారని, ఇతర మతపెద్దలను బయటే ఉంచడంతో ప్రధాని మోదీ సంకుచితత్వం బయటపడిందని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆక్షేపించారు.

Published : 29 May 2023 04:33 IST

ఇతర మతపెద్దలను బయట ఉంచడం మోదీ సంకుచితత్వం: అసదుద్దీన్‌ ఒవైసీ

భుక్తాపూర్‌(ఆదిలాబాద్‌), న్యూస్‌టుడే: పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం సమయంలో వేదపండితులతో మాత్రమే ప్రవేశం చేశారని, ఇతర మతపెద్దలను బయటే ఉంచడంతో ప్రధాని మోదీ సంకుచితత్వం బయటపడిందని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆక్షేపించారు. ప్రధానిగా అందరితో కలిసి ప్రవేశించి ఉంటే ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం వచ్చేదని అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్‌లో ఆదివారం రాత్రి పార్టీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. మోదీ, హోంమంత్రి అమిత్‌షా సంధించే ప్రశ్నలకు ఇకపై దీటుగా సమాధానాలిస్తానన్నారు. అమిత్‌షా తెలంగాణ వచ్చినప్పుడల్లా తనను విమర్శిస్తున్నారన్నారు. ‘తెలంగాణ సచివాలయాన్ని నేను చెప్పినట్లే నిర్మించారనడం సరికాదు. దానిని గుజరాత్‌లోని హనుమాన్‌ మందిరం నమూనాలో కట్టారు. ఈ నిర్మాణ విషయం నాకు ముందే చెప్పిఉంటే తాజ్‌మహల్‌, చార్మినార్‌ తరహా నిర్మించమనేవాడిని. రాబోయే ఎన్నికల్లో అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తాం’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని