శిందే వర్గాన్ని వీడనున్న 22 మంది ఎమ్మెల్యేలు!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు భాజపా తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారని ఉద్ధవ్ వర్గం శివసేన పత్రిక సామ్నా పేర్కొంది.
9 మంది ఎంపీలు కూడా..
శివసేన పత్రిక సామ్నా కథనం
ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు భాజపా తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారని ఉద్ధవ్ వర్గం శివసేన పత్రిక సామ్నా పేర్కొంది. వారంతా శివసేన(శిందే వర్గం)ను వీడాలనుకుంటున్నారని రాసుకొచ్చింది. ‘శిందే వర్గానికి చెందిన చట్టసభ సభ్యులు ఎంతో అసౌకర్యంగా ఉన్నారని, భాజపా వారిపై సవతి తల్లి ప్రేమ చూపుతుండటమే అందుకు కారణమని తెలుస్తోంది. వారంతా ఆ గ్రూప్‌ను వీడాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఠాక్రేకు నమ్మకద్రోహం చేసి, భాజపాతో చేతులు కలిపారు. ఒక ఏడాదిలోనే వారి అనుబంధానికి బీటలు వారింది. ఇప్పుడు విడాకుల గురించి చర్చలు నడుస్తున్నాయి’ అని సామ్నా దుయ్యబట్టింది. కొద్దిరోజుల క్రితం శివసేన(శిందే) ఎంపీ గజానన్ కీర్తికార్ చేసిన వ్యాఖ్యలే సామ్నా స్పందనకు కారణమని తెలుస్తోంది. ‘మేం ఎన్డీఏలో భాగం. కానీ మాకు అందులో సవతి తల్లి ప్రేమే దక్కుతోంది’ అని గజానన్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.