ఇక హత్య కేసునూ బెయిలబుల్‌గా మార్చండి!

జగన్‌ సీఎంగా ఉన్నంత కాలం హత్య కేసును బెయిలబుల్‌గా మార్చి.. 41ఏ నోటీసుతో సరిపెట్టేలా చట్టసవరణ చేయాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావులు ఎద్దేవా చేశారు.

Updated : 01 Jun 2023 05:55 IST

తెదేపా నేతలు వర్ల, బొండా ఎద్దేవా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగన్‌ సీఎంగా ఉన్నంత కాలం హత్య కేసును బెయిలబుల్‌గా మార్చి.. 41ఏ నోటీసుతో సరిపెట్టేలా చట్టసవరణ చేయాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావులు ఎద్దేవా చేశారు. ప్రజాసేవ చేయడంలో విఫలమైన జగన్‌..తన అధికారం, అవినీతి సొమ్మును ఉపయోగించి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు అవినాష్‌రెడ్డిని కాపాడటంలో సఫలమయ్యారని మండిపడ్డారు. అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు  పున:సమీక్షిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. ‘జగన్‌ దిల్లీ పర్యటనలు విజయవంతమయ్యాయి. అధికార బలం, అవినీతి సొమ్ము ఉన్న పెద్దలకు ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయంలా రాష్ట్రంలో పరిస్థితులు మారాయి’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని