జగన్‌ పాలన అంతానికి ఈ మేనిఫెస్టో తొలిమెట్టు

మహానాడు వేదికగా తెదేపా ప్రకటించిన తొలి మేనిఫెస్టో.. జగన్‌ దుష్టపాలన అంతానికి తొలి మెట్టు కాబోతోందని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.

Published : 01 Jun 2023 05:03 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మహానాడు వేదికగా తెదేపా ప్రకటించిన తొలి మేనిఫెస్టో.. జగన్‌ దుష్టపాలన అంతానికి తొలి మెట్టు కాబోతోందని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఈ మినీ మేనిఫెస్టోతో జే గ్యాంగ్‌లో వణుకు మొదలైందన్నారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని ప్రారంభించింది ఎన్టీఆర్‌ అయితే.. దాన్ని చంద్రబాబు కొనసాగిస్తూ అభివృద్ధిని జత చేశారని బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుక, సంక్రాంతి కానుక, రంజాన్‌ తోఫా, నిరుద్యోగభృతి, అన్నదాత సుఖీభవ లాంటి సుమారు 118 సంక్షేమ కార్యక్రమాల్ని జగన్‌ రద్దు చేశారని ధ్వజమెత్తారు. ‘తెదేపా మేనిఫెస్టో ప్రజలకు భరోసాగా నిలవనుంది. మహాశక్తి పథకంతో మహిళలు బలోపేతం అవనున్నారు. ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం ద్వారా గ్యాస్‌ ధరల నుంచి విముక్తి లభించనుంది. బీసీలను రక్షించుకోవడమే లక్ష్యంగా ప్రత్యేక రక్షణ చట్టానికి రూపకల్పన చేయనున్నాం. సంక్షేమం, అభివృద్ధి సామాజిక న్యాయంతో తెదేపా ముందుకు వెళ్తుంటే..లూటీ చేయడం, అప్పులు చేయడం, రాష్ట్రాన్ని దోచుకోవడం ఎజెండాగా జగన్‌ పాలన సాగిస్తున్నారు’ అని యనమల పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని