MP Raghurama: జగన్‌ దంపతులను విచారిస్తేనే వివేకా హత్య కుట్రకోణం వెలుగులోకి..

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దంపతులను విచారిస్తేనే వివేకా హత్య కేసులోని విస్తృత కుట్ర కోణం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు.

Updated : 10 Jun 2023 08:44 IST

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దంపతులను విచారిస్తేనే వివేకా హత్య కేసులోని విస్తృత కుట్ర కోణం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. ఈ హత్య వార్త అందరికంటే ముందే జగన్‌కి తెలుసని, ఆయనకు ఆ విషయాన్ని ఎవరు చెప్పారన్నదే అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హత్య వార్త జగన్‌కు ముందే తెలుసని సీబీఐ అధికారులు ఒకసారి కాగితంపై పెట్టిన తర్వాత తప్పకుండా దానికి ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం ప్రకటన కూడా ఉందని గుర్తు చేశారు. దిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న మాగుంట రాఘవరెడ్డి అమ్మమ్మకు ఆరోగ్యం బాగా లేకపోతే హైకోర్టు మానవతా దృక్పథంతో ఇచ్చిన 15 రోజుల బెయిల్‌ను 24 గంటలు గడవక ముందే ఈడీ సుప్రీంకోర్టు ఛాలెంజ్‌ చేస్తే, వివేకా హత్య కేసులో నిందితుల విషయంలో మాత్రం సీబీఐ ఉదాసీన వైఖరిని అవలంబించడం విమర్శలకు దారి తీస్తోందని చెప్పారు.  వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తున్నారని, కంటే ఇటువంటి ఒక కుమార్తెను కనాలని అనిపించేలా ఈ పోరాటం ఉందని రఘురామ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని