Ambati Rambabu: ఎవరో చెప్పింది చేస్తానంటే ఎలా నమ్ముతారు?: పవన్‌పై అంబటి విమర్శలు

‘ఆయన పార్టీ పెట్టారు.. ప్రజలు మెచ్చుకుంటే సీఎం అవుతారు గానీ, ఎవరో చెప్పింది చేస్తానంటే ఎలా నమ్ముతారు’ అని అని పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

Updated : 15 Nov 2023 08:19 IST

కొవ్వూరు పట్టణం, చాగల్లు, న్యూస్‌టుడే: ‘ఆయన పార్టీ పెట్టారు.. ప్రజలు మెచ్చుకుంటే సీఎం అవుతారు గానీ, ఎవరో చెప్పింది చేస్తానంటే ఎలా నమ్ముతారు’ అని అని పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పెనకనమెట్టలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మంగళవారం వచ్చిన ఆయన బహిరంగ సభలో తెదేపా, జనసేన అధినేతలపై విమర్శలు గుప్పించారు. పేదలకు, పెత్తందారులకు జరిగే మహా సంగ్రామంలో జగన్‌ గెలవడమంటే పేదవాడు గెలిచినట్లేనన్నారు. స్కిల్‌ స్కామ్‌లో పవన్‌కల్యాణ్‌కూ వాటా ఉందని ఆరోపించారు. చంద్రబాబును జైలులో పెడితే వేరే పార్టీ నాయకులెవరూ అక్కడికి వెళ్లలేదని, పవన్‌కల్యాణ్‌ మాత్రమే ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. కాపు సామాజికవర్గం వారు మనవాడు సీఎం కావాలని కోరుకోవడం తప్పుకాదని, పవన్‌కల్యాణ్‌ మాత్రం చంద్రబాబు సీఎం కావాలనుకుంటే ఏం చేయాలో ఆలోచించుకోవాలన్నారు. హోం మంత్రి తానేటి వనిత, నిడదవోలు, రాజానగరం ఎమ్మెల్యేలు జి.శ్రీనివాసనాయుడు, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు