లక్షల మంది తరలివచ్చి కూటమిని ఆశీర్వదించారు

చిలకలూరిపేటలో భాజపా, తెదేపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వంటిది ఈ దశాబ్దంలో చూడలేదని జనం చెబుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Published : 19 Mar 2024 05:06 IST

‘ప్రజాగళం’పై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: చిలకలూరిపేటలో భాజపా, తెదేపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వంటిది ఈ దశాబ్దంలో చూడలేదని జనం చెబుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. సభకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి కూటమిని ఆశీర్వదించారన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా తన నివాసంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘ప్రజలపై ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించకుండా, వాలంటీర్ల బెదిరింపులు లేకుండా కేవలం కూటమిలోని భాగస్వామ్య పార్టీలపై ఉన్న అభిమానంతోనే జనం ఈ సభకు హాజరయ్యారు. మనల్ని మనమే కాపాడుకోవాలన్న స్పృహ వారిలో కనిపించింది. ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ జారీ చేయడం కూడా సభ సక్సెస్‌కు మరో కారణం. లేకపోతే ప్రజలను వైకాపా నేతలు బెదిరించి ఉండేవారు. వైకాపా ప్రభుత్వం గద్దె దిగిపోవాలన్న సంకల్ప బలంతో ప్రజలు సభకు హాజరయ్యారు’’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని