ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోదీ లేఖ

లోక్‌సభ ఎన్నికల తొలి విడత బరిలో ఉన్న ఎన్డీయే అభ్యర్థులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడివిడిగా లేఖలు రాశారు.

Published : 18 Apr 2024 04:08 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల తొలి విడత బరిలో ఉన్న ఎన్డీయే అభ్యర్థులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడివిడిగా లేఖలు రాశారు. భారత వర్తమానాన్ని మెరుగైన భవిష్యత్తుతో అనుసంధానించేందుకు ఈ ఎన్నికలు గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ‘‘గత పదేళ్లలో సమాజంలో అన్ని వర్గాలవారి జీవన నాణ్యత మెరుగుపడింది. వారి కష్టాలు చాలావరకు తొలగిపోయాయి. అయితే చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రతిఒక్కరికీ మెరుగైన జీవితాన్ని అందించాలన్న మన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ ఎన్నికలు అత్యంత నిర్ణయాత్మకమైనవి. భాజపాకు వచ్చే ప్రతి ఓటు.. సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు దోహదపడుతుంది. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యంతో భారత్‌ చేస్తున్న ప్రయాణానికి మరింత వేగాన్ని అందిస్తుంది’’ అని లేఖలో వ్యాఖ్యానించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నందువల్ల ఉదయమే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తన సందేశాన్ని ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లకు తెలియజేయాలని అభ్యర్థులకు సూచించారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి బరిలో ఉన్న కె.అన్నామలై, ఉత్తరాఖండ్‌లోని పౌడీ గఢ్వాల్‌ల నుంచి పోటీ చేస్తున్న అనిల్‌ బలూనీలకు మోదీ రాసిన లేఖలను భాజపా వర్గాలు మీడియాతో పంచుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని