దిల్లీ కాంగ్రెస్‌.. గల్లీ కాంగ్రెస్‌ వేర్వేరు

దిల్లీ కాంగ్రెస్‌, గల్లీ కాంగ్రెస్‌ వేరువేరని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భాజపాకు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

Published : 20 Apr 2024 03:13 IST

 భాజపా ఏజెంట్‌లా రేవంత్‌రెడ్డి తీరు
మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపణ

జహీరాబాద్‌, న్యూస్‌టుడే: దిల్లీ కాంగ్రెస్‌, గల్లీ కాంగ్రెస్‌ వేరువేరని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భాజపాకు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో భారాస నేత ఖీజర్‌యాఫై శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ఈద్‌మిలాప్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆరెస్సెస్‌కు చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలోని ముస్లిం సోదరులను పట్టించుకోవడం లేదన్నారు. వారి ఓట్లతో అధికారంలోకి వచ్చి, ఆ వర్గంలో ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వలేదని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, అదానీలను రాహుల్‌గాంధీ విమర్శిస్తుంటే, సీఎం మాత్రం వారిని మెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెక్యులర్‌ అని, ఎంఐఎం నేతలు మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో భాజపాకు లబ్ధి చేకూరేలా చాలాచోట్ల బలహీనమైన అభ్యర్థులను కాంగ్రెస్‌ రంగంలోకి దింపిందని, ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ మూడో స్థానానికే పరిమితమవుతుందన్నారు. అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పోటీ పడుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్‌లో అబద్ధాల పోటీ..

కాంగ్రెస్‌ నాయకులు పోటీపడి మరీ అబద్ధాలు చెబుతున్నారని, ఆ పార్టీ ఆరు గ్యారంటీలు.. నూరు అబద్ధాలతో సమానమని మరోసారి నిరూపితమైందని భారాస సీనియర్‌ నేత హరీశ్‌రావు శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా విమర్శించారు. నిండు అసెంబ్లీలో నిరుద్యోగ భృతిపై తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని అభాసుపాలైన భట్టి.. తాజాగా రుణమాఫీపై కూడా నాలుక మడతపెట్టారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని