ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి నామినేషన్‌

రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు.

Published : 20 Apr 2024 03:30 IST

రాజమహేంద్రవరం (వి.ఎల్‌.పురం, దేవీచౌక్‌), న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. తొలుత నగరంలోని తన నివాసం నుంచి తెదేపా, జనసేన, భాజపా శ్రేణులతో కలిసి ఆమె భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కేంద్రమంత్రి వీకే సింగ్‌, భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తులతో కలిసి కలెక్టర్‌ మాధవీలతకు నామినేషన్‌ పత్రాలు అందించారు. అనంతరం పురందేశ్వరి విలేకర్లతో మాట్లాడారు. గత ఎన్నికల్లో వైకాపాపై విశ్వాసంతో ప్రజలు అధికారం అప్పగించారని.. ఆ నమ్మకాన్ని కాపాడుకోలేకపోయిన జగన్‌కు ఎందుకు ఓటు వేయాలని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంతో పాటు ఈ ప్రాంతమూ అభివృద్ధి చెందాలంటే ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని పేర్కొన్నారు. సమావేశంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీవిశ్వనాథరాజు, ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌, జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని