అయిదో రోజు మరో ఏడుగురు

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్‌ వేశారు.

Published : 08 May 2024 04:43 IST

29కి చేరిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్లు

ఈనాడు, నల్గొండ: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్‌ వేశారు. దీంతో ఇప్పటి వరకు నామినేషన్‌ వేసిన అభ్యర్థుల సంఖ్య 29కి చేరింది. ప్రతిపక్ష భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి తరఫున ఇప్పటికే ప్రతిపాదకులు నామినేషన్‌ దాఖలు చేయగా...మంగళవారం మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిలతో కలిసి ఆయన మరోసెట్‌ నామినేషన్‌ వేశారు. శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్‌, స్వతంత్ర అభ్యర్థులుగా పిడిశెట్టి రాజు, పూజారి సత్యనారాయణ, భీమా గుగులోతు, డాక్టర్‌ పెంచాల శ్రీనివాస్‌, కంటే సాయన్న, అల్వాల కనకరాజులు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి సీహెచ్‌.మహేందర్‌కు నామపత్రాలు అందజేశారు. భాజపా ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. రేపటి(మే9)తో నామినేషన్ల పర్వం ముగుస్తుండగా నేడు భాజపా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు