హరియాణా రాజకీయాల్లో కలకలం

హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్‌ సింగ్‌ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు.

Published : 08 May 2024 04:44 IST

నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణ

చండీగఢ్‌: హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్‌ సింగ్‌ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సోంబీర్‌ సాంగ్వాన్‌, రణధీర్‌ గోలెన్‌, ధరంపాల్‌ గోందర్‌లు హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌సింగ్‌ హుడా, పీసీసీ అధ్యక్షుడు ఉదయ్‌ భాన్‌ల సమక్షంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.  ‘‘90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీలో ప్రస్తుత సభ్యుల సంఖ్య (మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, మరో స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్‌ చౌటాలా రాజీనామాలతో) 88కు పడిపోయింది. భాజపాకు 40 మంది సభ్యుల బలం ఉంది.  నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. అందుకే తక్షణం ఆయన రాజీనామా చేయాలి’’ అని హరియాణా పీసీసీ అద్యక్షుడు ఉదయ్‌ భాన్‌ పేర్కొన్నారు. తక్షణం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు