పంటల బీమా పరిహారం దోచుకున్న దొంగలెవరు?

రైతులకు దక్కాల్సిన పంట నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి... వైకాపా నాయకులు, కార్యకర్తలకు దోచిపెడుతున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌బాబు

Published : 22 Jun 2022 05:09 IST

తెదేపా నేత నక్కా ఆనంద్‌బాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రైతులకు దక్కాల్సిన పంట నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి... వైకాపా నాయకులు, కార్యకర్తలకు దోచిపెడుతున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌బాబు ధ్వజమెత్తారు. ‘పంట నష్టపోయిన రైతులెవరు? పరిహారాన్ని ఎవరికి కట్టబెట్టారు? బీమా పరిహారం చెల్లింపులో ఎందుకంత రహస్యం? వెబ్‌సైట్‌లో రైతుల పేర్లు ఎందుకు చూపడం లేదు...’ అని మండిపడ్డారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘బీమా పరిహారం కింద ప్రభుత్వం విడుదల చేసిన రూ.2.977 కోట్లు ఏ రైతులకు ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలి. దీనిపై రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏ ప్రాతిపదికన నష్టపరిహారాన్ని అంచనా వేశారు? ఇందులో కౌలు రైతులు ఎందరు ఉన్నారు? 15 లక్షల మందికి బీమా పరిహారం చెల్లిస్తే వారి పేర్లు బయటపెట్టడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటి?’ అని నక్కా ఆనంద్‌బాబు తీవ్రంగా ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని