నాయకుల మధ్య భావ వైరుధ్యాలు.. పార్టీకి నష్టం కలిగించకూడదు

నాయకులు, శ్రేణుల మధ్య ఉండే భావ వైరుధ్యాలు.. పార్టీ మూల సూత్రాలకు, సిద్ధాంతాలకు భిన్నంగా, పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగించేవిగా ఉండకూడదని జనసేన అధ్యక్షుడు

Published : 27 Jun 2022 04:05 IST

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: నాయకులు, శ్రేణుల మధ్య ఉండే భావ వైరుధ్యాలు.. పార్టీ మూల సూత్రాలకు, సిద్ధాంతాలకు భిన్నంగా, పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగించేవిగా ఉండకూడదని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. పార్టీ విధివిధానాలు, నియమాలకు విరుద్ధంగా పరిణామాలు చోటుచేసుకుంటే అంతర్గత విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందుకు అవసరమైన మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గత ఐదు రోజులుగా జనసేన కార్యకర్తలు, నాయకులతో సమీక్షలు జరిపిన పవన్‌కల్యాణ్‌ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ‘‘జనసేన కార్యక్రమాల అమలు, నిర్వహణలో నాయకులు, శ్రేణులు సమన్వయంతో ముందుకు వెళ్లాలి. పార్టీకి బలంగా నిలిచే కార్యకర్తలను విస్మరించొద్దు. పార్టీ నియమావళి, నిబంధనల్ని నాయకుల నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ పాటించాలి’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని