Dharmana Prasada Rao: పార్టీపై ఆధారపడి బతకొద్దు

కార్యకర్తలు ఏదో ఒక వృత్తి చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవాలే తప్ప ఏదో ప్రయోజనాన్ని ఆశించి, పార్టీపై ఆధారపడి బతకొద్దని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైకాపా

Updated : 27 Jun 2022 07:45 IST

కార్యకర్తలకు మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచన

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: కార్యకర్తలు ఏదో ఒక వృత్తి చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవాలే తప్ప ఏదో ప్రయోజనాన్ని ఆశించి, పార్టీపై ఆధారపడి బతకొద్దని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైకాపా కార్యకర్తలకు సూచించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ కళావేదికలో ఆదివారం వైకాపా ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఏం చేయాలో తెలియడం లేదు. అవినీతి జరుగుతోందని, అభివృద్ధి జరగడం లేదని చెప్పలేకపోతున్నారు. చంద్రబాబు సైతం మాట్లాడలేక బాదుడే బాదుడు అంటూ నానా యాగీ చేస్తున్నారు. ధరల పెరుగుదలకు వైకాపా కారణం కాదు. ఆ ప్రభావం దేశమంతా ఉంది. చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన మద్యాన్నే నేడు రాష్ట్రంలో అమ్ముతున్నాం. కొత్తగా ఎక్కడి నుంచో తెచ్చి అమ్మడం లేదు. ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటు రూ.1.80 లక్షలు ఇస్తోంది. ఇల్లు కట్టుకోవాల్సిన బాధ్యత లబ్ధిదారులది. వారు ఎక్కడో కూర్చుంటే నిర్మాణం పూర్తవుతుందా? కొంత సొమ్ము కలుపుకొని నిర్మాణం పూర్తి చేసుకోవాలి. ముఖ్యమంత్రి సభకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రతి కార్యకర్తా రావాలి. సీఎం పర్యటన విఫలమైతే ఆ బాధ్యత మనందరిదే’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని