రీవాల్యుయేషన్‌, సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు మినహాయించాలి: రేవంత్‌రెడ్డి

ఇంటర్‌ రీవాల్యూయేషన్‌, సప్లిమెంటరీ పరీక్షల ఫీజును మినహాయించాలని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జీవితం యొక్క విలువను అర్థం చేసుకోవాలని, ఎటువంటి

Published : 30 Jun 2022 05:39 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఇంటర్‌ రీవాల్యూయేషన్‌, సప్లిమెంటరీ పరీక్షల ఫీజును మినహాయించాలని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జీవితం యొక్క విలువను అర్థం చేసుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవద్దని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఇంటర్‌ ఫలితాల నేపథ్యంలో ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు.

పేదలకు ఇచ్చిన భూములు తీసుకోవడాన్ని ఖండిస్తున్నా: భట్టి

పేదలు, బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్‌, గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములను అభివృద్ధి అవసరాల పేరిట తెరాస ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ భూములను లాక్కోవడానికి ఎవరు ప్రయత్నించినా తిరగబడండి అని పిలుపునిచ్చారు.

విభజన హామీలపై మోదీ సమాధానం చెప్పాలి: జగ్గారెడ్డి

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వస్తున్న ప్రధాని మోదీ..రాష్ట్ర విభజన హామీలు, ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15లక్షల జమ, ఉద్యోగాల భర్తీపై సమాధానం చెప్పాలని మ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మోదీ సర్కార్‌ ఏర్పడి 8 సంవత్సరాలైనా తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. ‘ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి కాలేదు. నదీ జలాల పంపకం అపరిష్కృతంగా ఉంది. ఆంధ్రాలో విలీనమైన ముంపు గ్రామాలు తిరిగి తెలంగాణలో చేరలేదు. వీటన్నింటికీ మోదీ సమాధానం చెప్పాలని’ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల సంక్షేమ వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని మాజీమంత్రి గీతారెడ్డి డిమాండ్‌ చేశారు. ఉదయ్‌పూర్‌లో మంగళవారం జరిగిన టైలర్‌ కిరాతక హత్యను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌లను రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం సీఎంకు బహిరంగ లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని