వాలంటీర్లు.. వైకాపా కార్యకర్తల్లాంటివారు

‘గ్రామాల్లో వాలంటీర్ల పెత్తనం ఎక్కువైంది. ప్రజలెవరూ తమ వద్దకు రాలేదని కొందరు చెబుతున్నారు. అసలు ఎవరండీ వాలంటీర్లు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు

Published : 01 Jul 2022 04:48 IST

నెల్లూరు ప్లీనరీలో మంత్రి అంబటి

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: ‘గ్రామాల్లో వాలంటీర్ల పెత్తనం ఎక్కువైంది. ప్రజలెవరూ తమ వద్దకు రాలేదని కొందరు చెబుతున్నారు. అసలు ఎవరండీ వాలంటీర్లు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు ఏర్పాటుచేసిన వారు కాదా? ఎవరిని అడిగి పెట్టాం? ఊర్లో సర్పంచి, నాయకులను అడిగి కాదా.. నేను చెబుతున్నా.. వాలంటీర్లందరూ మీరు చెబితేనే వచ్చినవారు.. అవసరమైతే చెప్పండి తీసేస్తాం.. మళ్లీ కొత్తవారిని చేర్చుకుంటాం.. ఎవరైనా తప్పు చేస్తే, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదు.. వాలంటీర్లు వైకాపాకు పనిచేస్తున్న కార్యకర్తల్లాంటి వారు.. పార్టీ విషయాలను వారి పరిధిలోని 50 ఇళ్లో.. 100 ఇళ్లకో చేరవేసే సైనికులు’ అని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గురువారం నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని కనుపర్తిపాడులో ఏర్పాటు చేసిన వైకాపా జిల్లాస్థాయి ప్లీనరీలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని