వైకాపాది గోల్‌మాల్‌ పాలన

రాష్ట్రంలో వైకాపా గోల్‌మాల్‌ పాలన కొనసాగుతోందని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం

Published : 02 Jul 2022 05:11 IST

భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు

విశాఖపట్నం (పెదవాల్తేరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా గోల్‌మాల్‌ పాలన కొనసాగుతోందని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విపరీతంగా పన్నులు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. ఉద్యోగుల జీపీఎఫ్‌ నుంచి రూ.800 కోట్లు మాయం చేసి సాంకేతిక కారణాలని చెప్పడం కుంటి సాకులని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్సీల నిధులకు సాంకేతిక సమస్యలు ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. కేంద్రం ఆరు నెలల్లో రెండుసార్లు పెట్రోలు ధరలు తగ్గిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు బస్సు ఛార్జీలు పెంచి సామాన్యులపై భారం మోపిందన్నారు. విజయవాడ-విశాఖ మధ్య రూ.504 ఉన్న టికెట్‌ ధరను రూ.574కి పెంచారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అధికారం చేపట్టాలన్న ఆలోచనతో హైదరాబాద్‌లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. కేంద్ర మంత్రులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి పేర్లు మార్చి అమలుచేస్తున్న కేంద్ర పథకాలపై అవగాహన కల్పించనున్నారన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పరిశ్రమలు రావడం లేదు సరికదా.. ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌ రాజు, పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని